పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
ద్వారకాతిరుమల(పశ్చిమగోదావరి): పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ద్వారకాతిరుమల ఆలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే రవికుమార్‌తో రామసీతకు పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఒక కుమార్తె ఉంది. కాగా, దంపతుల మధ్య విభేదాలు తలెత్తి విడిపోయారు.
స్థానిక కుంకుళ్లమ్మ గుడి అర్చకుడు నాగరాజు రామసీతతో వివాహేతర సంబంధం కొన్నాళ్లుగా నడుస్తోంది. నాగరాజుకు పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. కొన్ని రోజులుగా నాగరాజు కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలోనే మంగళవారం రామసీత(28) తన ఇంట్లోనే మృతి చెందిపడి ఉంది. ఆమె ఒంటిపై గాయాలున్నాయి. ఆమె తల్లి సీతారావమ్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బీమడోలు సీఐ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు.