పోలవరం : పీపీఏ అధికారుల సమావేశం

Polavaram Project Authority Officials Would Visit Uninhabited villages - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : పోలవరం ప్రాజెక్టు అథారిటీ మంగళవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించింది. అనంతరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ ఆర్కే జైన్‌ ఆధ్వర్యంలో నవయుగ కంపెనీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో పీపీఏ అధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ నెల 30న విజయవాడలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఉన్నతస్థాయి సమీక్ష జరుగనుంది. పోలవరం నిర్వాసిత గ్రామాల్లో పీపీఏ అధికారులు పర్యటించనున్నారు. కాగా, తాజా సమావేశంలో ప్రాజెక్టు అధికారులు నిధుల చెల్లింపు విషయమై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలిసింది. 

మరోవైపు ఇరిగేషన్ అధికారులపై కాంట్రాక్టు ఏజెన్సీలు ఒత్తిడి పెంచుతున్నాయి. బిల్లులు చెల్లింపులు పెండింగ్‌ కావడంతో ఆ ప్రభావం ప్రాజెక్టు నిర్మాణంపై పడుతోంది. ప్రాజెక్టు నూతన అంచనాలకు కేంద్ర జలవనరుల శాఖ ఆమోదం లభిస్తేనే నిధులు విడుదలయ్యే అవకాశమున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది జూన్‌ నాటికి గ్రావిటీ ద్వారా గోదావరి జలాలను అందించేందుకు నిర్దేశించిన పనులు ఎంతవరకు వచ్చాయి, పనులు ఎలా జరుగుతున్నాయని పీపీఏ బృందం పరిశీలించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top