రాజధాని ప్రాంతంలో వైఎస్ జగన్ పర్యటన దృష్ట్యా సీఆర్‌డీఏ అధికారులు హడావుడి సృష్టిస్తున్నారు.
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటన దృష్ట్యా సీఆర్‌డీఏ అధికారులు హడావుడి సృష్టిస్తున్నారు. తుళ‍్లూరు సీఆర్‌డీఏ ఆఫీస్ వద్ద గురువారం అధికారులు సమావేశం నిర్వహించారు. వైఎస్ జగన్ పర్యటనలో అభ్యంతరం తెలపాలంటూ రైతులకు సూచించారు.
గత కొంతకాలంగా వాయిదా వేస్తున్న ప్లాట్ల కేటాయింపులను అధికారులు హడావుడిగా గురువారం చేపట్టారు. మధ్యాహ్నం మందడం గ్రామస్తులకు ప్లాట్ల కేటాయిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్ రాకతో సీఆర్‌డీఏ అధికారులు కొత్త షెడ్యూల్‌ను విడుదల చేశారు. అధికారుల తీరుపై రైతులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.