ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు.... | Plan to develop of AP: Palle Raghunatha Reddy | Sakshi
Sakshi News home page

ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు....

Sep 21 2014 2:36 PM | Updated on May 3 2018 3:17 PM

పల్లె రఘునాథ రెడ్డి - Sakshi

పల్లె రఘునాథ రెడ్డి

ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు, ఐదు కాంపెయిన్స్తో రాష్ట్రాభివృద్ధికి ప్రణాళిక రూపొందించినట్లు సమాచార పౌరసంబంధాలు, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు.

విశాఖపట్నం: ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు, ఐదు కాంపెయిన్స్తో రాష్ట్రాభివృద్ధికి ప్రణాళిక రూపొందించినట్లు సమాచార పౌరసంబంధాలు, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు మంత్రి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల హామీలను మూడు దశల్లో నెరవేరుస్తామని చెప్పారు.

 ప్రతి ఇంట్లో అక్షరాశ్యులు, ఇంటికో పారిశ్రామికవేత్త ఉండేలా ప్రణాళిక తయారు చేసినట్లు తెలిపారు. విప్రోతో 6,400 మందికి, టెక్ మహేంద్రతో 5వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు. పవర్ సెక్టార్లో ఏపిని దేశంలోనే ఒక మోడల్ స్టేట్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి పల్లె చెప్పారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement