రెండు రూపాయలు తగ్గనున్న లీటర్ పెట్రోల్ ధర | Petrol rates cut by over Rs.2 per litre from Aug 15 | Sakshi
Sakshi News home page

రెండు రూపాయలు తగ్గనున్న లీటర్ పెట్రోల్ ధర

Aug 13 2014 9:17 PM | Updated on Sep 2 2017 11:50 AM

రెండు రూపాయలు తగ్గనున్న లీటర్ పెట్రోల్ ధర

రెండు రూపాయలు తగ్గనున్న లీటర్ పెట్రోల్ ధర

స్వాతంత్రదినోత్సవ కానుకగా వాహన వినియోగదారులకు ఊరట కలిగించే విధంగా పెట్రోల్ ధరను తగ్గించాలని దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి

న్యూఢిల్లీ: స్వాతంత్రదినోత్సవ కానుకగా వాహన వినియోగదారులకు ఊరట కలిగించే విధంగా పెట్రోల్ ధరను తగ్గించాలని దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 2.18 పైసలు తగ్గిస్తున్నట్టు దేశీయ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
దేశంలోని వివిధ పట్టణాల్లో పెట్రోల్ ధరలు సుమారు 2 రూపాయలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. 14 తేది అర్ధరాత్రి నుంచి తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీలు వెల్లడించాయి. 
 
ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత పెట్రోల్ ధర తగ్గించడం ఇది రెండవసారి. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు దిగి రావడం, అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి బలపడటం లాంటి అంశాలు పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టడానికి కారణమయ్యాయని కంపెనీలు తెలిపాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement