జన్మభూమిలోమూడవరోజూ కొనసాగిన నిరసనలు

People Protests in Janmabhoomi Maa vooru Programme - Sakshi

సాక్షి నెట్‌ వర్క్‌ : సమస్యలు పరిష్కరించని జన్మభూమి సభలు ఎందుకని జనం మండి పడుతున్నారు. ఎక్కడికక్కడ అధికారులను నిలదీస్తున్నారు.
చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నాని ఆగడాలు ఎక్కువవు తున్నాయి. జన్మభూమి గ్రామ సభల వేదికలపైకి అనుచరవర్గాన్ని తీసుకెళ్లి కూర్చోబెడుతుండడంతో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం భాకరాపేట జన్మభూమి గ్రామసభలోనూ ఇదే తీరుగా వ్యవహరిం చడం వివాదాస్పదమైంది.
నాలుగున్నరేళ్ల కాలంలో తిరుచానూరు ప్రజలకు ఒక్క ఇల్లు కూడా కేటాయించలేదని తిరుచానూరు ఎంపీటీసీ నరేష్‌ రెడ్డి, తాజా మాజీ వార్డు సభ్యుడు మునేంద్ర రాయల్, వైఎస్సార్‌సీపీ నాయకురాలు యశోద అన్నా రు. ఐదు జన్మభూమి కార్యక్రమాల్లో అర్జీలు తీసుకుంటున్నారే తప్పా ఒక్కటీ పరిష్కరిం చిన దాఖలాలు లేవని మండిపడ్డారు.
తన రేషన్‌ కార్డును యాక్టివేషన్‌ చేయమని అడిగితే తిరుపతి రూరల్‌ డీటీ రోశయ్య రూ.3వేలు లంచం అడిగారని తిరుచానూరు నేతాజివీధికి చెందిన గోపాల్‌ జన్మభూమిలో అధికారుల వద్ద వాపోయాడు. కార్డును ఎందుకు నిలిపేశారో చెప్పాలని గోపాల్‌తో పాటు స్థానికులు అధికారులను నిలదీశారు.
గంగవరం మండలం పత్తికొండ, మామడుగు పంచాయతీల్లో జన్మభూమి కార్యక్రమాల్లో విద్యార్థులతో డ్యాన్స్‌లు చేయించారు.
గుర్రంకొండలో తాగునీటి సమస్య పరిష్కరించాలని పంచాయతీ కార్యాలయం వద్ద జరుగుతున్న జన్మభూమి గ్రామసభ ఎదురుగా మహిళలు ధర్నా చేశారు.
ప్రోటోకాల్‌ సమస్య రావడంతో కల్లూరు జన్మభూమి కార్యక్రమంలో అధికారులందరూ కిందనే కూర్చుని సభలు నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌రావు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అనీషా రెడ్డి వస్తారని చెప్పినా వారు హాజరుకాలేదు.
తాగునీటి సమస్య పరిష్కరించాలని చౌడేపల్లె మండలం పందిళ్లపల్లె, ఆమినిగుంట గ్రామ పంచాయతీల మహిళలు జన్మభూమి సభల్లో అధికారులను నిలదీశారు.
విజయపురం మండలం ఆలపాకం, మాధవరం గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో జనం కంటే అధికారులు ఎక్కువగా ఉండడం విమర్శలకు తావిచ్చింది.
బుచ్చినాయుడుకండ్రిగ మండలం వీఎస్‌ పురం గ్రామంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై అధికారులను నిలదీశారు.
పెద్దతిప్పసముద్రం మండలం మడుమూరులో అంగన్‌వాడీ పిల్లలను కూర్చోబెట్టారు.
రామసముద్రం మండలం కాంపల్లె పంచా యతీలో అర్హులైన వారికి ఇళ్లు మంజూరు కాకపోవడంపై మహిళలు అధికారులను నిలదీశారు. మదనపల్లె మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గుర్రప్పనాయుడు కలుగజేసుకోవడంపై ఎమ్మెల్యే దేశాయ్‌తిప్పారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రామచంద్రారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ కేశవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్‌ లేని వ్యక్తులు జోక్యం చేసుకోవడం సభ్యత కాదని మండిపడ్డారు. ఆయ న్ను బయటకు పంపాలని ధర్నా చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top