పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయండి | Pending Works Has To Be Completed Said By Ministers | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయండి

Jun 27 2019 8:07 PM | Updated on Sep 3 2019 8:50 PM

Pending Works Has To Be Completed Said By Ministers - Sakshi

సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై  గురువారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌తో  మంత్రులు  సమీక్షా సమావేశం నిర్శహించారు. ఈ సమావేశానికి మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, పేర్ని నాని, కొడాలి నాని హాజరయ్యారు. విజయవాడలో జరుగుతున్న నిర్మాణ పనులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సూచనల మేరకు తాము అభివృద్ధి పనులపై దృష్టి పెట్టినట్లు అధికారులకు తెలిపారు. దుర్గ గుడి ఫ్లైఓవర్‌ను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని , అలాగే మిగిలిపోయిన పెండింగ్‌ పనులను కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. విజయవాడ నగరం నుంచి అన్ని ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఉండడంతో ఇక్కడ సహజంగానే ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి  ట్రాఫిక్‌ ఫ్రీ చేయడమే తమ ముందున్న లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అలాగే గుణదల దగ్గర సగంలో ఆగిపోయిన ఫ్లైఓవర్‌ పై దృష్టి సారించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గారి ఆలోచన విధానాలను దృష్టిలో ఉంచుకొని అన్ని పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement