పవన్ కళ్యాణ్ రూ.50 లక్షల విరాళం | Pawan kalyan donates Rs. 50 lakh for hudud cyclone victims | Sakshi
Sakshi News home page

పవన్ కళ్యాణ్ రూ.50 లక్షల విరాళం

Oct 14 2014 2:08 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ కళ్యాణ్ రూ.50 లక్షల విరాళం - Sakshi

పవన్ కళ్యాణ్ రూ.50 లక్షల విరాళం

హుదూద్ తుఫాను బాధితులకు సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రూ.5౦ లక్షల తక్షణ సాయం ప్రకటించారు.

హైదరాబాద్ : హుదూద్ తుఫాను బాధితులకు సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రూ.5౦ లక్షల తక్షణ సాయం ప్రకటించారు. విరాళాన్ని చెక్కు రూపంలో ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడుకు అందచేయనున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు తుఫాను సహాయక చర్యల్లో అభిమానులు పాల్గొనాలని పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చారు.

 

ఉత్తరాంధ్రలో సాధ్యమైనంత త్వరలో పరిస్థితులు చక్కబడాలని కోరుకుంటుకున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. మరోవైపు రాంచరణ్ కూడా తుఫాను బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.10 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే.


 

Advertisement
 
Advertisement
Advertisement