రేషన్‌ డీలర్ల ఎగ్జామ్ పేపర్ లీక్ | paper leak leaks for ration shops dealer exams | Sakshi
Sakshi News home page

రేషన్‌ డీలర్ల ఎగ్జామ్ పేపర్ లీక్

Nov 20 2016 11:15 AM | Updated on Sep 4 2017 8:38 PM

రేషన్‌ డీలర్ల ఎగ్జామ్ పేపర్ లీక్

రేషన్‌ డీలర్ల ఎగ్జామ్ పేపర్ లీక్

రేషన్ డీలర్ల పరీక్షలో అధికార పార్టీ నాయకులు తమ చేతివాటం చూపించారు.

కాకినాడ: రేషన్ షాపు డీలర్ల కోసం నిర్వహిస్తున్న పరీక్షలో అధికార పార్టీకి చెందిన నాయకులు తమ చేతివాటం చూపించారు. తమకు అనుకూలమైన వారికి ముందుగానే పరీక్షా పత్రం అందించి తమవంతు సాయం చేశారు. కాకినాడ డివిజన్ పరిధిలోని 128 రేషన్ షాపులకు డీలర్ల ఎంపిక కోసం ఈ రోజు పరీక్ష జరగనుండగా.. నిన్న సాయంత్రమే అధికార పార్టీ నేతలు జవాబులతో కూడిన ప్రశ్నపత్రాలను తమ అనుకూలులకు అందించారు.

కాకినాడలోని మెక్‌లారెర్స్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 10:30కు జరిగే ఈ పరీక్షకు 660 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement