కేసీఆర్కు తెలంగాణ స్థానికత వర్తిస్తుందా? | Palle Raghunath Reddy takes on kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్కు తెలంగాణ స్థానికత వర్తిస్తుందా?

Aug 11 2014 5:41 PM | Updated on Aug 15 2018 9:22 PM

కేసీఆర్కు తెలంగాణ స్థానికత వర్తిస్తుందా? - Sakshi

కేసీఆర్కు తెలంగాణ స్థానికత వర్తిస్తుందా?

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుపై విరుచుకుపడ్డారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుపై విరుచుకుపడ్డారు. విజయనగరం జిల్లా బుడ్డిపేటలో పుట్టిన కేసీఆర్‌కు తెలంగాణ స్థానికత ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు.

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌పై సుప్రీం కోర్టు తీర్పును అమలుచేస్తామని పల్లె రఘునాథ్‌రెడ్డి చెప్పారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. అక్టోబర్ 2నుంచి గ్రామాలు, పట్టణాలు, నగరాలకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయనున్నట్టు మంత్రి  చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement