
విభజన ప్రక్రియ వేగంగా సాగుతోంది: పళ్లంరాజు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఎంత కోరినా కాంగ్రెస్ అధిష్టానం వినట్లేదని కేంద్ర మంత్రి పల్లంరాజు అన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఎంత కోరినా తమ మాటను కాంగ్రెస్ అధిష్టానం వినట్లేదని కేంద్ర మంత్రి పల్లంరాజు అన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ చాలా వేగంగా సాగుతోందని చెప్పారు. కాగా ఏ ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజిస్తున్నారో తెలియదని పళ్లంరాజు తెలిపారు.
ప్రాంతాల వారీగా విడిపోయినా ప్రజల మధ్య విభేదాలు రాకూడదని కోరుకుంటున్నట్టు పళ్లంరాజు వ్యాఖ్యానించారు. సీమాంధ్రకు కేంద్ర ప్రభుత్వం ఎలా న్యాయం చేస్తుందనే విషయాన్ని చెప్పలేమని అన్నారు. 11 అంశాల్లో సీమాంధ్రకు న్యాయం చేయాలని జీవోఎంను కోరినట్టు మంత్రి తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామ చేసిన పళ్లంరాజు అనంతరం విధులకు హాజరవుతున్నారు.