మరో బ్రెయిన్ డెడ్ కేసులో అవయవాలు దానం | organs donation of a brain dead persons organs | Sakshi
Sakshi News home page

మరో బ్రెయిన్ డెడ్ కేసులో అవయవాలు దానం

Mar 15 2015 7:59 PM | Updated on Aug 14 2018 3:33 PM

ఇచ్ఛాపురానికి చెందిన కృష్ణారావు అనే వ్యక్తికి బ్రెయిన్ డెడ్ సంభవించింది.

విశాఖపట్నం:ఇచ్ఛాపురానికి చెందిన కృష్ణారావు అనే వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయ్యింది. అతని మెదడు పనిచేయకపోవటంతో వారి కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. కృష్ణారావు ఊపిరితిత్తులు, కిడ్నీలను సావిత్రిబాయి పూలే ట్రస్టుకు దానం చేశారు. ఆయన రెండు కిడ్నీలను కేర్, అపోలో ఆస్పత్రులకు అందించారు. అలాగే ఊపిరితిత్తులను కేర్ ఆస్పత్రికి అందించారు.

ఈ నెల ఆరంభంలో ఇదే తరహా ఘటన ఒకటి చోటు చోసుకున్న సంగతి తెలిసిందే. విజయవాడలో3వ తేదీన సెంటినీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద తోట మణికంఠ(21) మోటారు సైకిల్ నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో మణికంఠ బ్రెయిన్‌డెడ్  కావడంతో అతని అవయవాలను నలుగురికి దానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement