నగరంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ చేపట్టారు.
విజయవాడలో ఆపరేషన్ ముస్కాన్
Jul 28 2017 11:16 AM | Updated on Sep 5 2017 5:05 PM
విజయవాడ: నగరంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ చేపట్టారు. తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకొని ఇళ్ల నుంచి పారిపోయి వచ్చిన చిన్నారులు, అనాథలకు ఆశ్రయం కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు పోలీసులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, హోటళ్లు, వాణిజ్య సదుపాయాలు, పార్కులు, రహదారులు, పారిశ్రామిక వాడల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు పలువురు చిన్నారులను అదుపులోకి తీసుకొని వారిని చైల్డ్ హోమ్‌కు తరలించారు.
Advertisement
Advertisement