45 నిమిషాల్లోనే రిజిస్టేషన్ | online registration launched in andhra pradesh | Sakshi
Sakshi News home page

45 నిమిషాల్లోనే రిజిస్టేషన్

Apr 2 2015 4:46 PM | Updated on Sep 2 2017 11:45 PM

45 నిమిషాల్లోనే రిజిస్టేషన్

45 నిమిషాల్లోనే రిజిస్టేషన్

ఆంధ్రప్రదేశ్ లో ఇక ఎక్కడి నుంచైనా భూ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ఇక ఎక్కడి నుంచైనా భూ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో భూ రిజిస్ట్రేషన్లు, వివాహ రిజిస్ట్రేషన్ల విధానాన్ని మంత్రులు కేఈ కృష్ణమూర్తి, పల్లె రఘునాథరెడ్డి గురువారం ప్రారంభించారు. ఎక్కడినుంచైనా, ఏ రిజిస్ట్రేషన్ అయినా ఆన్ లైన్ లో చేసుకోవచ్చని మంత్రులు ఈ సందర్భంగా తెలిపారు.

45 నిమిషాల్లో రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ కు కూడా ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు. దీనివల్ల వినియోగదారులకు చాలా సమయం కలిసొస్తుందని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement