టీడీపీ బహిష్కృత నేత, ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు గురువారం తన చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు.
ఒంగోలు : టీడీపీ బహిష్కృత నేత, ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు గురువారం తన చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. తాను వచ్చేసరికే చాంబర్‌కు తాళాలు వేసి ఉండడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే బైఠాయించారు. జెడ్పీ చైర్మన్గా కొనసాగాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా సీఈవో సహకరించటం లేదని ఈదర ఆవేదన చెందారు. తనకు న్యాయం జరిగేవరకూ కదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు.