గన్నవరంలో ఎడ్ల పోటీలు ప్రారంభం

Ongole Bull Competition Started In Gannavaram - Sakshi

సాక్షి, గన్నవరం: జాతీయస్థాయి ఎడ్లబండి లాగుడు, ఆవుల అందాల పోటీలను కృష్ణా జిల్లా గన్నవరంలో ఎన్టీఆర్‌ పశువైద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో మంగళవారం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు ఆళ్ల నాని, రంగనాథరాజు ప్రారంభించారు. నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వరంలో ఐదు రోజులు పాటు పోటీలు జరగనున్నాయి. తొలిరోజు పదిహేడు జతల ఒంగోలు జాతి బసవన్నలు కాలు దువ్వాయి. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈ పోటీల్లో తమ యజమానిని, ఊరిని ప్రథమస్థానంలో నిలిపేందుకు పోటీలు పడ్డాయి. ఈ పోటీలకు దేశం నలుమూలల నుంచి 150 జతల ఎడ్లు తరలి రానున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి ఎండ్లబండ లాగుడు పోటీలను తిలకించారు. ఈ పోటీలు 13 వ తేదీ వరుకు జరుగుతాయి. పోటీల్లో గెలుపొందిన ఎడ్ల జతలకు రూ.20 లక్షలకు పైగా నగదు బహుమతులు ఇవ్వనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top