‘మెరిసీ’పట్నం | One ticket for event | Sakshi
Sakshi News home page

‘మెరిసీ’పట్నం

Feb 11 2014 1:58 AM | Updated on Sep 2 2017 3:33 AM

‘మెరిసీ’పట్నం

‘మెరిసీ’పట్నం

భీష్మ ఏకాదశి సందర్భంగా షిరిడీసాయి సేవాసమాజ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సోమవారం రాత్రి లక్ష దీపారాధన చేశారు.

  •      ఘనంగా లక్ష దీపారాధన
  •      కనువిందు చేసిన దీపాల వరుసలు
  •  నర్సీపట్నం టౌన్, న్యూస్‌లైన్: భీష్మ ఏకాదశి సందర్భంగా షిరిడీసాయి సేవాసమాజ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సోమవారం రాత్రి లక్ష దీపారాధన చేశారు. విభిన్న ఆకృతుల్లో ఏర్పాటు చేసిన దీపాల వరుసలు విశేషంగా ఆకర్షించాయి. సేవాసమాజ్ ప్రతినిధులతో పాటు మహిళలు, చిన్నారులు స్వచ్ఛందం గా కార్యక్రమంలో పాల్గొని దీపాలను వెలిగిం చారు. స్వస్తిక్, ఓం, పూర్ణకుంభం, జ్యోతి, శివలింగం తదితర ఆకృతుల్లో ఏర్పాటు చేసిన దీపాల వరుసలు కట్టిపడేసాయి.

    తెల్లవారుజామున బాబా ఆలయంలో విశేష పూజలు, వ్రతాలు చేశారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు దంపతులతో బాబా సింహాసనానికి ఉన్న సింహాల ప్రతిమలకు వెండి తొడుగులు తొడిగారు. ధూపపీఠంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కార్యక్రమానికి నర్సీపట్నం చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. రాత్రికి దీపాలంకరణ నడుమ భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. భక్తులతో స్టేడియం కిటకిటలాడింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement