రిపేరు కోసం కరెంటు స్థంభంపైకి ఎక్కిన ఓ వ్యక్తి విద్యుత్‌షాక్ కొట్టడంతో తీవ్రగాయాలైన సంఘటన ప్రకాశంజిల్లా కొమరోలులో బుధవారం జరిగింది.
రిపేరు కోసం కరెంటు స్థంభంపైకి ఎక్కిన ఓ వ్యక్తి విద్యుత్‌షాక్ కొట్టడంతో తీవ్రగాయాలైన సంఘటన ప్రకాశంజిల్లా కొమరోలులో బుధవారం జరిగింది. కొమరోలులోని సాయిబాబా ఆలయ సమీపంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగటంతో మరమ్మతు కోసం బాషా అనే వ్యక్తి స్థంభంపైకి ఎక్కాడు. ప్రమాద వశాత్తు అతడినిక షాక్ కొట్టడంతో తీవ్రగాయాల పాలయ్యాడు. అతడిని వెంటే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు