రాపూరు శివారులో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
రాపూరు (నెల్లూరు జిల్లా) : రాపూరు శివారులో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. డక్కిలి మండలం దేవుడు యల్లంపల్లికి చెందిన వారధి(50), చంద్ర (45) మోటార్ బైక్‌పై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొంది.
ఈ ప్రమాదంలో మోటార్ బైక్ నడుపుతున్న వారధి అక్కడికక్కడే మృతిచెందగా, చంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రుడిని డక్కిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.