తొలిరోజే పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టిన జగన్ | On First day, YS Jagan mohan reddy concentrates on party affairs | Sakshi
Sakshi News home page

తొలిరోజే పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టిన జగన్

Sep 25 2013 12:59 PM | Updated on Jul 25 2018 4:07 PM

తొలిరోజే పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టిన జగన్ - Sakshi

తొలిరోజే పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టిన జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిరోజే పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టారు.

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిరోజే పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టారు. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు ఆయన బుధవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ, తాజా మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో భేటీ అయ్యారు.  

లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.  దాదాపు అరగంటపాటు ఈ భేటి జరిగింది. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? మిగిలిన రాజకీయ పార్టీలపై ఒత్తిడి ఎలా పెంచాలనే దానిపై సమాలోచనలు జరిగాయి.  రాజీనామా చేయకుండా డ్రామాలాడుతున్న కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు తీరుపై ఎలా ఎండగట్టాలనే దానిపై చర్చించినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement