ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం! | Nuziveedu triple IT student commits suicide | Sakshi
Sakshi News home page

ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం!

Jan 31 2014 10:00 AM | Updated on Nov 6 2018 7:53 PM

ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం! - Sakshi

ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం!

కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటి విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది.

కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటి విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా, లింగాపాలెంకు చెందిన 22ఏళ్ల నవీన్, బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం మూడో అంతస్థు పైకి చేరుకున్న నవీన్ కిందకు దూకేశాడు. వెంటనే అతడిని నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించగా,  వైద్యులు మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించాలని సూచించారు. అయితే మార్గమధ్యంలోనే నవీన్ మృతి చెందాడు.

నవీన్ ... క్యాంపస్ ఇంటర్వ్యూలో విఫలమై తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు సమాచారం. కొంతకాలంగా కడుపునొప్పితో కూడా బాధపడుతున్నట్టు ట్రిపుల్ ఐటి డైరెక్టర్ చెబుతున్నారు. నవీన్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే కాలేజీ ఇంఛార్జ్‌ మాత్రం ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడిపోయినట్లు చెబుతున్నాడు. మృతుడి సోదరుడు ఇదే కాలేజీలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement