విజయవాడలో ఎన్టీఆర్‌ మ్యూజియం | NTR Museum in Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో ఎన్టీఆర్‌ మ్యూజియం

Jan 18 2017 1:43 AM | Updated on Sep 5 2017 1:26 AM

విజయవాడలో ఎన్టీఆర్‌ మ్యూజియం

విజయవాడలో ఎన్టీఆర్‌ మ్యూజియం

స్వర్గీయ నందమూరి తారక రామారావు 21వ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం తెలుగు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాలు జరగనున్నాయి.

సాక్షి, అమరావతి: స్వర్గీయ నందమూరి తారక రామారావు 21వ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం తెలుగు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాలు జరగనున్నాయి. ఎన్టీఆర్‌ అభిమాన సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో అమరజ్యోతి ర్యాలీని నిర్వహిస్తుండగా, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విజయవాడలో ఎన్టీఆర్‌ మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు.

ఈ నెల 18 నుంచి 25 వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మ్యూజియంలోకి ప్రజలను అనుమతిస్తారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మొట్టమొదటి సారిగా ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పార్టీ కార్యాలయ కార్యదర్శి టీడీ జనార్థన్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement