ఏపీ ఈసెట్‌లో అర్హత సాధించిన (డిప్లొమా, బీఎస్సీ మేథ్స్) అభ్యర్థులకు ఇంజనీరింగ్,, ఫార్మా కాలేజీల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి
ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ. 600, ఇతరులు రూ.1200 ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలన్నారు. ఒకటవ ర్యాంకు నుంచి ఆరు వేల వరకు జూన్ 29న, 6,001 నుంచి 14 వేల వరకు జూన్ 30న, 14,001 నుంచి 22వేల వరకు జూలై ఒకటిన, 22,001 నుంచి చివరి ర్యాంకు వరకు జూలై 2న పరిశీలన చేస్తారు. దివ్యాంగులు ఇతర ప్రత్యేక కేటగిరీల వారు విజయవాడలోని బెంజ్‌సర్కిల్‌లో ఉన్న పాలిటెక్నిక్‌లోని కేంద్రంలో పరిశీనలకు రావాలి. అభ్యర్ధులు జూన్ 30 నుంచి జూలై 3న సాయంత్రం 6 గంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ‘హెచ్‌టీటీపీఎస్://ఏపీఈసీఈటీ.ఎన్‌ఐసీ.ఐఎన్’ వెబ్‌సైట్లో ఆప్షన్లు ఇవ్వాలి. జూలై 5న సీట్ల కేటాయింపు వివరాలు వెబ్‌సైట్లో పొందుపర్చనున్నారు.