యూజీ ఆయుష్‌ వైద్యవిద్య సీట్ల భర్తీకి వెబ్‌ కౌన్సెలింగ్‌

Second Phase Web Counseling For UG Ayush Medical Seats In Telangana - Sakshi

ఆప్షన్ల కోసం 16 నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం  

సాక్షి, హైదరాబాద్‌: యూజీ ఆయుష్‌ వైద్య విద్య సీట్ల భర్తీకి రెండో విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. వర్సిటీ పరిధిలోని ఆయుష్‌ కళాశాలల్లో హోమియోపతి (బీహెచ్‌ ఎంఎస్‌), ఆయుర్వేద (బీఏఎంఎస్‌), యునాని (బీయూఎంఎస్‌), నేచురోపతి– యోగా (బీఎన్‌వైసీ) కోర్సుల్లో కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనుంది.

ఈ నెల 16 ఉదయం 8 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 6గంటల వరకు అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసు కోవాలని, తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. అయితే అఖిల భారత కోటాలో, కాళోజీ, ఎన్టీఆర్‌ వర్సిటీలలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో సీటు పొందిన అభ్యర్థులు ఈ వెబ్‌ కౌన్సెలింగ్‌కు అనర్హులని పేర్కొంది. మరింత వివరాలకు www.knruhs.telangana.gov.in¯ను చూడాలని వెల్లడించింది. 

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top