లేడీస్‌ హాస్టల్‌ కు నీటి సరఫరా బంద్ | no water for au ladies hostel | Sakshi
Sakshi News home page

లేడీస్‌ హాస్టల్‌ కు నీటి సరఫరా బంద్

Sep 12 2014 9:56 PM | Updated on May 3 2018 3:17 PM

లేడీస్‌ హాస్టల్‌ కు నీటి సరఫరా బంద్ - Sakshi

లేడీస్‌ హాస్టల్‌ కు నీటి సరఫరా బంద్

ఆంధ్రా యూనివర్సిటీలో నీటి కొరత కారణంగా ఇంజనీరింగ్‌ కాలేజీ లేడీస్‌ హాస్టల్‌ విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు.

విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీలో నీటి కొరత కారణంగా ఇంజనీరింగ్‌ కాలేజీ లేడీస్‌ హాస్టల్‌ విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. వసతి గృహంలోని బ్లాక్‌-5లో నాలుగు రోజులుగా తాగునీరు లేకపోవడంతో విద్యార్థినులు కష్టాలు పడుతున్నారు.

ఈ ఉదయం నుంచి వాడుక నీరు కూడా నిలిచిపోవడంతో వారి బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. తాము ఫోన్ చేసినా వార్డెన్‌, చీఫ్‌ వార్డెన్లు స్పందించడం లేదని విద్యార్థినులు వాపోతున్నారు. వెంటనే నీటి సరఫరాను పునరుద్దరించాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement