నో సెక్యూరిటీ.. నో డిపాజిట్ | No security..No deposite | Sakshi
Sakshi News home page

నో సెక్యూరిటీ.. నో డిపాజిట్

Dec 18 2014 3:22 AM | Updated on Aug 24 2018 2:36 PM

జిల్లాలో పౌర సరఫరాల శాఖ గాడి తప్పింది. లెసైన్స్‌ల మంజూ రులో నిబంధనలకు తిలోదకాలు ఇస్తోంది. ఇష్టారాజ్యం గా లెసైన్స్‌లు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికీ గండి కొడుతోంది.

సాక్షి, గుంటూరు: జిల్లాలో పౌర సరఫరాల శాఖ గాడి తప్పింది. లెసైన్స్‌ల మంజూ రులో నిబంధనలకు తిలోదకాలు ఇస్తోంది. ఇష్టారాజ్యం గా లెసైన్స్‌లు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికీ గండి కొడుతోంది.
 
  ఫుడ్ సేఫ్టీ యాక్ట్-2006 ప్రకారం ప్రతి ఏటా ఆర్టికల్స్ తయారు చేసే దుకాణాల నుంచి లెసైన్స్ రెన్యువల్ ఫీజును సెక్యూరిటీ డిపాజిట్‌గా వసూలు చేయాలి ఆర్టికల్స్ తయారు చేసే దుకాణాలుగా పిలువబడే రైస్ మిల్లులు, రేషన్ షాపులు, ఎంఎల్‌ఎస్ పాయింట్లు, పసుపు, మిరప ట్రేడర్లు, బార్ అండ్ రెస్టారెంట్ల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేస్తారు. రైస్ మిల్లులకు ఏడాదికి రూ. ఐదు వేలు, మిగతా వాటికి రూ. రెండు వేలు చొప్పున డిపాజిట్‌గా రాబట్టాలి.
 
 లెసైన్స్ రెన్యువల్ సమయంలోనే పౌర సరఫరాల శాఖ దీనిని వసూలు చేయాలి.మూడేళ్లుగా అధికారులు సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేయకుండా లెసైన్స్‌లను రెన్యువల్ చేస్తున్నట్లు సమాచారం. అధికారులు తనిఖీలు చేసిన సమయంలో ఏవైనా లోపాలు ఉంటే ఈ డిపాజిట్ నుంచి రికవరీ పెడతారు. ప్రభుత్వానికీ వడ్డీ రూపంలో ఆదా యం సమకూరుతోంది.
 2011 నుంచి 2014 వరకు సెక్యూరిటీ డిపాజిట్ కింద పౌర సరఫరాల శాఖ ఫీజు వసూలు చేయడం లేదని విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం. దీనివల్ల రూ. 2.08 కోట్ల మేర ఆదాయానికి గండి పడినట్లు లెక్కలు కట్టారు. ఈ విషయాన్ని విజిలెన్స్ ఎస్పీ కేవీ మోహన్‌రావు ‘సాక్షి’ వద్ద ధ్రువీకరించారు.
 ఇష్టారాజ్యంగా లెసైన్స్‌ల మంజూరు...
 పౌరసరఫరాల శాఖ నిబంధనలు పక్కన పెట్టి జిల్లాలో ఇష్టారాజ్యంగా లెసైన్స్‌లు మంజూరు చేస్తున్నట్లు సమాచారం. దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించాల్సిన అధికారులు లంచాల కోసం చూసీచూడనట్టు ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement