శ్రీనివాసరావుని కోర్టులో హాజరుపరిచిన ఎన్ఐఏ

NIA Custody Petition Postponed - Sakshi

సాక్షి, విజయవాడ:  ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ అధికారులు నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుని విజయవాడ ఎంఎస్‌జే కోర్టులో శుక్రవారం హాజరు పరిచారు. ఈ నెల 25 వరకు నిందితుడికి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో నిందితుడిని తమ కస్టడీకి అప్పగించాలంటూ ఎన్ఐఏ పిటిషన్‌ దాఖలు చేసింది.

నిందితుడి తరుపు న్యాయవాదులు ఎవరూ కస్టడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయక పోవడంతో కస్టడీ పిటిషన్ కాపీని నిందితుడికి కోర్టు అందజేసింది. (శ్రీనివాస్‌ బెయిల్‌ పిటిషన్‌ డిస్మిస్‌)

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top