అర్ధరాత్రి 1 గంట వరకూ మద్యం | New Year's Day liquor shop open Night One | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి 1 గంట వరకూ మద్యం

Dec 31 2018 10:16 AM | Updated on Dec 31 2018 10:16 AM

New Year's Day liquor shop open Night One  - Sakshi

 తాగినోళ్లకు తాగినంత...అడ్డూలేదు..అదుపూలేదు..అర్ధరాత్రి వరకూ తాగండి...ఊగండంటోంది ..

అనంతపురం సెంట్రల్‌: తాగినోళ్లకు తాగినంత...అడ్డూలేదు..అదుపూలేదు..అర్ధరాత్రి వరకూ తాగండి...ఊగండంటోంది ప్రభుత్వం. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. డిసెంబర్‌ 31, జనవరి 1 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 1 గంట వరకూ బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ మద్యం షాపుల్లో అమ్మకాలు చేపట్టుకోవచ్చునన్లి ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ సీఐ శ్యామ్‌ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం అమ్మకాల సమయ వేళలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. అయితే డాబాలు, హోటళ్లు, లాడ్జీల్లో మద్యం తాగేందుకు అనుమతిస్తే వాటి యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిసెంబర్‌ నెలలో 22 కేసులు నమోదు చేసి 420 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. 22 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement