దిల్‌ఖుష్ : నూతనోత్సాహం ఇలా.. | new year celebrations | Sakshi
Sakshi News home page

దిల్‌ఖుష్ : నూతనోత్సాహం ఇలా..

Jan 1 2014 3:40 AM | Updated on Oct 17 2018 4:29 PM

దిల్‌ఖుష్ : నూతనోత్సాహం ఇలా.. - Sakshi

దిల్‌ఖుష్ : నూతనోత్సాహం ఇలా..

టాప్‌లేపిన డ్యాన్స్.. కేక పెట్టించే సాంగ్స్.. ఎటుచూసినా చిన్నాపెద్దా కేరింత.. పరస్పర శుభాకాంక్షల పులకింత.. కళ్లు జిగేల్‌మనిపించే వెలుగులు.. దిల్‌ను మైమరిపించే మెరుపులు..

 స్టెప్పులేయించే మ్యూజిక్..
 టాప్‌లేపిన డ్యాన్స్.. కేక పెట్టించే సాంగ్స్.. ఎటుచూసినా  చిన్నాపెద్దా కేరింత.. పరస్పర శుభాకాంక్షల పులకింత.. కళ్లు జిగేల్‌మనిపించే వెలుగులు.. దిల్‌ను మైమరిపించే మెరుపులు.. మొత్తానికి నయాసాల్ జోష్ కలర్‌ఫుల్.. నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ నగరం ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టింది. పబ్‌లు, కాఫీక్లబ్‌లు, రెస్టారెంట్లు తదితర ప్రత్యేక వేదికలన్నీ యువత సంబరాలతో కిటకిటలాడాయి.
 
     మేడ్చల్‌లోని కంట్రీక్లబ్‌లో నటి చార్మి సందడి చేసింది
     మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో డీజే సుకేత్ తనదైన శైలిలో మ్యూజిక్‌తో మ్యాజిక్
     చేసి ఉర్రూతలూగించాడు
 
     పలుచోట్ల అంత ర్జాతీయ నృత్యకళాకారులు కొత్త సంవత్సర వేడుకల జోష్‌ను పెంచారు
     మాదాపూర్‌లోని నోవాటెల్, హైటెక్స్, హెచ్‌ఐసీసీ,  బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో ‘కొత్త’        సందడి అంబరాన్ని తాకింది
 
     సికింద్రాబాద్‌లోని ట్రిడెంట్, గ్రీన్‌పార్క్ హోటళ్లలో యువత ఉత్సాహం ఉరకలెత్తింది
     లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని మారియట్ గోల్డ్, సికింద్రాబాద్‌లోని బసేరా హోటల్‌లో ప్రత్యేక కార్యక్రమాలు అలరించాయి
 
     కాఫీ షాప్‌లు యువతీయువకుల కేరింతలతో కళకళలాడాయి
     నానక్‌రామ్‌గూడలోని హయత్ హోటల్, రాయదుర్గం జేఆర్‌సీ
     కన్వెన్షన్ సెంటర్‌లో డ్యాన్స్‌లు హోరెత్తాయి
 
     యువకులు వాహనాలపై రివ్వున దూసుకుపోతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సందడి చేశారు
 
     ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు, నారాయణగూడ, మెహిదీపట్నం, సికింద్రాబాద్, రాజేంద్రనగర్, తార్నాక తదితర ప్రాంతాలలో ట్రిబుల్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ
     పలువురు పోలీసులకు చిక్కారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement