సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో నూతన ఇసుక పాలసీ

New Sand Policy From September 5th In AP Says Krishna Collector Inthiyaz - Sakshi

సాక్షి, విజయవాడ : సెప్టెంబర్ 5 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నూతన ఇసుక పాలసీ రానుందని కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. బుధవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఇసుక కొరతపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, వసంత కృష్ణా ప్రసాద్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ.. ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇల్లు నిర్మించుకునే వారికి ప్రధమ ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రభుత్వం ఇసుకను స్టాక్ పాయింట్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. ఎవరికైనా ఇసుక కావాలంటే సంబంధిత తహసీల్ధార్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. ఈ నెల 19 నుంచి కొత్త పాలసీ వచ్చే వరకు ఇదే విధానం అమలు జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో తోట్ల వల్లూరు ఇసుక రిచ్ మాత్రమే తెరిచి ఉంటుందని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top