సూర్యలంకకు కొత్త శోభ


సూర్యలంక (బాపట్ల): సూర్యలంక బీచ్‌కు కొత్త శోభను తీసుకురావాలని, పర్యాటకులకు తగిన రక్షణ కల్పించటంతోపాటు వారు ప్రశాం తంగా తిరిగి వెళ్లేవరకు అన్ని శాఖలు బాధ్యతాయుతంగా పని చేయాలని ప్రభుత్వాధికారులు నిర్ణయించారు. నూతన రాజధానికి అతి దగ్గరలో ఉన్న సూర్యలంక బీచ్‌కు కొత్త శోభను తీసుకురావడానికి, పర్యాటకుల రక్షణ, సదుపాయాలను కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యే కోన రఘుపతి, ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్, రూరల్ జిల్లా ఎస్పీ కె.నారాయణనాయక్‌లతోపాటు 12 శాఖల అధికారులతో బుధవారం సూర్యలంకలో సమీక్షా సమావేశం జరిగింది.

 

రూరల్ జిల్లా ఎస్పీ నారాయణనాయక్ మాట్లాడుతూ సూర్యలంక సముద్ర తీరంలో స్నానాలు ఆచరించేందుకు వచ్చి న యువకులు గత ఐదేళ్ళలో  58 మంది మృతి చెందారని తెలిపారు. ఇటీవల మరో నలుగురు విద్యార్థులు మృత్యువాతకు గురయ్యారని చెపుతూ, ఇలాంటి  సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బీచ్‌లో పోలీసు ఔట్ పోస్టు, వైద్యశాల నిర్మా ణానికి రెండు ఎకరాల భూమిని కేటాయించాలని రెవెన్యూ అధికారులను కోరారు.

 

సూర్యలంకను స్పెషల్ జోన్‌గా ప్రకటించాలి ..

బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ సూర్యలంక సముద్ర తీరం పంచాయతీ పరిధిలో ఉండటం, పంచాయతీలకు నిధులు తక్కువగా ఉండటంతో స్పెషల్ జోన్‌గా ప్రకటిస్తే అభివృద్ధి చెందుతుందని తెలిపారు పర్యాటకులు ప్రశాంతంగా స్నానాలు ఆచరించేందుకు ఇక్కడ ఉన్న ఆక్రమణలు తొలగించాలని కోరారు. పంచాయతీరాజ్ అతిథి గృహం వద్ద ఉన్న షాపుల్లోకి వ్యాపారస్తులు వెళ్ళేలా చూడాలని కోరారు.

 

బెల్టుషాపులు లేకుండా చూస్తాం ..

ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్ మాట్లాడుతూ తీరంలోనే కాకుండా చుట్టుపక్కల ఎక్కడా బెల్టు షాపులు లేకుండా చూస్తామని తెలిపారు. సూర్యలంకలో ఆక్రమణలను వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీ ఆధ్వర్యంలో నిధులు ఉన్నాయని, వాటి తో వెంటనే ప్రచార మైకులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

 

స్థలం కేటాయించేందుకు అభ్యంతరం లేదు ...

ఆర్డీఓ నరసింహులు మాట్లాడుతూ తీరం వద్ద ఔట్ పోస్టు, వైద్యశాల ఏర్పాటుకు స్థలం కేటాయిం చేందుకు అభ్యంతరం లేదన్నారు. రెవెన్యూ భూములపై సర్వే చేయించి సంబంధిత శాఖలకు భూమిని కేటాయిస్తామని చెప్పారు.

 

వలలతో రక్షణ వలయాలు ....

 నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు కఠిన చర్యలు చేపడతామని ఎక్సై జ్ డీఎస్పీ వి.అరుణకుమారి తెలిపారు.  అత్యవసర వైద్యసేవలు అందించేందుకు ఎయిర్‌పోర్స్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుందని సీనియర్ చీఫ్ సెక్యూర్టీ ఆఫీసర్ బి.ఖాన్, అసిస్టెంట్ సెక్యూర్టిటీ ఆఫీసర్ మధు తెలిపారు. సముద్రం తీర ప్రాంతంలో కొంత భాగానికి కంచె వేసేం దుకు చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ జిల్లా అధికారి సునీత తెలిపారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో సముద్రంలో ఎంత వరకు స్నానాలు చేసేందుకు వెళ్ళాలో సూచించే వలయాలను ఏర్పాటు చేస్తామని ఏడీఏ రాఘవరెడ్డి చెప్పారు.



అవసరమైతే వలలతో రక్షణవలయం ఏర్పా టు చేయటం, గజ ఈతగాళ్ళను రంగంలోకి దించుతామని తెలిపారు. లైఫ్ జాకె ట్లు ఏర్పాటుకు ఏపీ టూరిజం అసిస్టెంట్ డెరైక్టర్ వీవీఎస్ గంగరాజు సుముఖత తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ జివి. రమణ, సీఐలు సాధినేని శ్రీనివాసరావు, ఆంజనేయులు, మెరైన్ సీఐలు శ్రీనివాసరాజు, నిమ్మగడ్డ రామారావు, ఎక్సైజ్ సీఐ నయనతార తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top