పసికందును డ్రైనేజ్ లో పడేశారు.. | New born baby found in Sewage Canal | Sakshi
Sakshi News home page

పసికందును డ్రైనేజ్ లో పడేశారు..

Sep 16 2015 11:45 AM | Updated on Oct 17 2018 3:53 PM

అప్పుడే పుట్టిన పసికందును ఎవరో డ్రైనేజీలో పడేశారు.

అప్పుడే పుట్టిన పసికందును డ్రైనేజీలో పడేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటన విశాఖపట్టణంలోని కేజీహెచ్ వద్ద బుధవారం చోటు చేసుకుంది. ఆస్పత్రి పిల్లల వార్డు వెనక ఉన్న డ్రైనేజి కాలువలో మగశిశువు పడి ఉన్న  విషయాన్ని గమనించిన స్థానికులు ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందించారు. పసికందును డ్రైనేజ్ నుంచి వెలికి తీసి చికిత్స అందించారు. కాగా   శిశువు బతికే ఉందని.. కాళ్లను ఎలుకలు కొరికేశాయని అస్పత్రి అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement