వర్ధమాన హీరోయిన్ కోసం పోలీసుల వేట | Neetu Agarwal wanted in red sanders case | Sakshi
Sakshi News home page

వర్ధమాన హీరోయిన్ కోసం పోలీసుల వేట

Apr 24 2015 3:29 PM | Updated on Aug 21 2018 7:25 PM

వర్ధమాన హీరోయిన్ కోసం పోలీసుల వేట - Sakshi

వర్ధమాన హీరోయిన్ కోసం పోలీసుల వేట

ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో టాలీవుడ్ వర్ధమాన హీరోయిన్ నీతూ అగర్వాల్ పేరు నమోదైంది.

కర్నూలు: ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో టాలీవుడ్ వర్ధమాన హీరోయిన్ నీతూ అగర్వాల్ పేరు నమోదైంది. నీతూ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎర్రచందనం స్మగ్లర్కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టు పోలీసులు కనుగొన్నారు. గతవారం నీతూ బాయ్ఫ్రెండ్ మస్తాన్ వలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు ఈ విషయం వెలుగు చూసింది. కర్నూలు జిల్లా రుద్రవరం పోలీసు స్టేషన్లో గురువారం నీతూపై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని కర్నూలు జిల్లా  ఎస్పీ రవి కృష్ణ వెల్లడించారు.

నీతూను అరెస్ట్ చేసేందుకు సీఐ శ్రీనివాసులు సారథ్యంలోని పోలీసులు బృందం గురువారం హైదరాబాద్కు వచ్చింది. పోలీసుల నీతూ నివాసానికి వెళ్లగా ఇంటికి తాళం వేసిఉంది. పోలీసులు నీతూ కోసం గాలిస్తున్నారు. నీతూ 'ప్రేమ ప్రయాణం' అనే సినిమాలో నటించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement