చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయా: నవీన్‌ | Naveen Kumar Naidu Slams Chandrababu Over Corruption At Amaravati | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయా: నవీన్‌

Published Mon, Mar 11 2019 2:47 PM | Last Updated on Mon, Mar 11 2019 3:00 PM

Naveen Kumar Naidu Slams Chandrababu Over Corruption At Amaravati - Sakshi

సాక్షి, తిరుపతి: అమరావతిలో అన్ని అక్రమాలే జరుగుతున్నాయని సన్‌షైన్‌ ప్రొడక్షన్‌ లిమిటెడ్‌ ఎండీ, నారావారిపల్లెకు చెందిన నవీన్‌కుమార్‌ నాయుడు విమర్శించారు. అమరావతిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఆయన సోమవారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. అమరావతిలో ఏ ఒక్క పని కూడా నిబంధనల ప్రకారం జరగడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి కోటిన్నర రూపాయలు పెట్టి అమరావతిలో స్టూడియో నిర్మించి మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు చేసి మరి స్టూడియో నిర్మించినట్టు చెప్పారు.

ఏపీ ప్రభుత్వం పిలిచిన ప్రతి టెండర్‌లో పాల్గొన్న కానీ ఏ ఒక్క వర్క్‌ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. పన్నులన్నీ దొడ్డిదారిన సొంతవారికే కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో జరుగుతున్న అక్రమాలపై చంద్రబాబు, లోకేశ్‌కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. న్యాయం కోసం పోరాటం చేస్తానని వెల్లడించారు. కాగా, చంద్రబాబు స్వగ్రామానికి చెందిన నవీన్‌ ఆయనపై ఈ స్థాయిలో విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రెస్‌క్లబ్‌లో నవీన్‌ మాట్లాడుతున్న సమయంలో టీడీపీ నేతలు నవీన్‌ బంధువులను పంపించి.. నవీన్‌ను అక్కడి నుంచి తీసుకుపోయే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ నవీన్‌ తనకు జరిగిన అన్యాయంపై పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement