ఉపాధికి ఊతమేది | National Rural Employment Guarantee Scheme | Sakshi
Sakshi News home page

ఉపాధికి ఊతమేది

Jun 22 2014 1:19 AM | Updated on Sep 2 2017 9:10 AM

జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పడకేసింది. గ్రామీణ నిరుపేదలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ పథకం కింద చెప్పుకోదగిన స్థాయిలో పనులు చేపట్టడం లేదు.

ఏలూరు : జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పడకేసింది. గ్రామీణ నిరుపేదలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ పథకం కింద చెప్పుకోదగిన స్థాయిలో పనులు చేపట్టడం లేదు. ఏటా ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చుచేసే అవకాశం ఉన్నా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, అధికారుల నైరాశ్యం కారణంగా తూతూమంత్రంగా పనులు జరుగుతున్నారుు. కూలీలకు ఏటా కనీసం 100 రోజులపాటు పనులు కల్పించలేని దుస్థితి నెలకొంది. ఫలితంగా పథకం లక్ష్యం నెరవేరకపోగా, గ్రామీణ కూలీలకు ఉపాధి అందని ద్రాక్షగా మిగిలిపోతోంది. ఏటా కొత్త పనులు జాబితాలోకి వచ్చి చేరుతున్నా చేపట్టలేని దుస్థితిలో యంత్రాంగం కొట్టుమిట్టాడుతోంది.
 
 ప్రతిపాదనలు ఘనం.. ఫలితం శూన్యం
 2014-15 ఆర్థిక సంవత్సరంలో 16 రకాల పనులను ప్రతిపాదించాలని డ్వామాకు ఆదేశాలు అందా యి. అధికారులు పనులకు సంబంధించి కార్యాచర ణ ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలో 5,218 పనులను కొత్తగా ప్రతిపాదించారు. వీటిని చేపట్టడం ద్వారా రూ.450 కోట్లను వెచ్చించాలని నిర్ణయించారు. ఏటా భారీస్థారుులో లక్ష్యాలు నిర్ధేశిస్తున్నా ఆశించిన స్థారుులో పనులు జరగటం లేదు. ఈ ఏడాదైనా లక్ష్యాన్ని సాధిస్తారా అన్నది అనుమానంగానే ఉంది.
 
 వ్యవసాయ పనుల అనుసంధానం
 వ్యవసాయ పనులను సైతం ఉపాధి హామీ పథకంలో చేపడతామని ప్రభుత్వం చెబుతోంది. అందుకు ప్రణాళికలు సైతం సిద్ధమయ్యూయి. గ్రామాల్లో ఉమ్మడి భూముల్లోని పొదలు, ముళ్లకంపలు, భూమి చదు ను, చేపలు, రొయ్యల చెరువుల్లో పూడి క తొలగింపు, కంపోస్టు పిట్‌ల తవ్వ కం, డ్రెయిన్‌లు, కాలువలు, ప్రాజెక్టుల్లో  గుర్రపుడెక్క తొలగింపు పనులను ఉపాధి హామీ పథకంలో చేపట్టే వీలు కలిగింది. వీటితోపాటు మంచి నీటి, రజక, దూడల చెరువుల్లో పూడిక తొలగింపు, రోడ్లకు అడ్డంగా ఉండే పొదల తొలగింపు, నేలనూతల బాగుసేత, కొబ్బరిచెట్ల పెంపకం, గండ్లు పడిన చెరువుల మరమ్మతులు, చిన్న-సన్నకారు రైతుల భూముల అభివృద్ధి, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ఉద్యాన క్షేత్రాల అభివృద్ది, గ్రామీణ రహదారుల అనుసంధాన ప్రాజెక్టు(ఆర్‌సీపీ) వంటి పనులు చేపట్టే అవకాశం దక్కింది. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది ఏమేరకు లక్ష్యాలను సాధిస్తారనేది వేచి చూడాల్సిందే.
 
 884 గ్రామాలు.. 5.95 లక్షల జాబ్‌కార్డులు
 ఉపాధి హామీ పథకం కింద జిల్లాలోని 884 గ్రామాల్లోనూ ఏదో ఒక పని చేసుకోవడానికి అవకాశాలు ఉన్నా యి. మొత్తం 2,172 నివాసిత ప్రాంతాల్లో డ్వామా ఆధ్వర్యంలో  5.94 లక్షల మందికి జాబ్‌కార్డులు ఇచ్చారు. అరుుతే, వీరిలో 2లక్షల మందికి కూడా పని కల్పించే పరిస్థితి కానరావడం లేదు. వారికైనా పది రోజులు కూడా పనులు కల్పించలేకపోతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement