కోడెల ఇంటి ముందు కేబుల్ ఆపరేటర్‌ ధర్నా

Narasaraopet Cable Operator Protest At Kodela Siva Prasad House - Sakshi

సాక్షి, గుంటూరు : టీడీపీ నేత, శాసన సభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబం అక్రమాలకు బలైన ఓ కేబుల్‌ ఆపరేటర్‌ వారి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. కబ్జాలు, అవినీతి, అక్రమాలతో తమ కులానికే చెడ్డపేరు తెచ్చారంటూ కోటేశ్వరరావు అనే వ్యక్తి కోడెల కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు.. ఎన్‌సీవీ పేరుతో నరసరావుపేటలో కోటేశ్వరరావు కేబుల్‌ నిర్వహిస్తుండేవాడు. కోడెల తనయుడు శివరామకృష్ణ కేబుల్‌ వైర్లు కత్తిరించి ఎన్‌సీవీని కబ్జా చేశాడు. 

దీంతో ఎన్‌సీవీ కేబుల్ వైర్లు కోడెల ఇంటి ముందు పడేసి సోమవారం ఆందోళనకు దిగారు. ఊరు వదిలి పారిపోయే పరిస్థితికి వచ్చారంటూ శివరామకృష్ణపై విమర్శలు చేశారు. కమ్మ హాస్టల్‌ నిర్మాణంలోనూ భారీగా అక్రమాలు చేశారని ధ్వజమెత్తారు. ఇదిలాఉండగా.. టీఆర్‌ లేకుండా సుమారు 800 బైక్‌లు విక్రయించిన వ్యవహారంలో కోడెల శివరామకృష్ణపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

(చదవండి : కోడెల కుమారుడిపై కేసు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top