లోకేష్ పీఏనంటూ ఎమ్మెల్యేకు బురిడీ | nara lokesh fake pa has been cheating on mla | Sakshi
Sakshi News home page

లోకేష్ పీఏనంటూ ఎమ్మెల్యేకు బురిడీ

Feb 10 2016 2:23 AM | Updated on Aug 29 2018 3:33 PM

ముఖ్యమంత్రి నారాచంద్రబాబు తనయుడు లోకేష్ పీఏ విజయ్‌నంటూ ఓ అజ్ఞాన వ్యక్తి తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకు మంగళవారం ఫోన్ చేసినట్లు సమాచారం..

లోకేష్ పీఏనంటూ ఎమ్మెల్యేకు బురిడీ కొట్టే యత్నం
అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్‌తో రూ. కోటి సిద్ధం చేసుకున్న ఎమ్మెల్యే
ఆపై, హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఆరా  
నగదు కోసం వ్యూహరచన చేశారని నిర్ధారణ
మాటువేసి  నిందితుల్నిపట్టుకున్న పోలీసుల రహస్య ప్రాంతంలో విచారణ


 తిరుపతి సిటీ : ముఖ్యమంత్రి నారాచంద్రబాబు తనయుడు లోకేష్ పీఏ విజయ్‌నంటూ ఓ అజ్ఞాన వ్యక్తి తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకు మంగళవారం ఫోన్ చేసినట్లు సమాచారం. తనకు చెందిన మనుషులు వస్తారని, వారి చేత కోటి రూపాయలు ఇచ్చి పంపిం చాలని ఎమ్మెల్యేకు ఫోన్‌లో విజయ్ పేరుతో కోరినట్లు తెలిసింది. ఆ అజ్ఞాత వ్యక్తి సీఎం సతీమణి భువనేశ్వరి పేరును కూడా వాడుకున్నట్టు సమాచారం. వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే సుగుణమ్మ, అల్లుడు సంజయ్ హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి ఫోన్‌చేసి ఆరా తీశారు. ఆ పేరుగల వ్యక్తి ఎవరూలేరని అక్కడి నుంచి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. దీంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే అర్బన్ ఎస్పీ గోపినాథ్‌జెట్టికి ఫిర్యాదు చేశారు. ఇంతలోపు మళ్లీ విజయ్ పేరుతో ఫోన్‌కాల్ రావడంతో డబ్బులు ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే సుగుణమ్మ అంగీకరించినట్టు సమాచారం.

 సమాచారం అందుకున్న వెస్టు పోలీసులు ఎమ్మెల్యే నివాసం వద్ద మాటు వేసి రెక్కీ నిర్వహించినట్టు తెలిసింది. ఇంతలోపే శ్రీకాళహస్తికి చెందిన ఓ వ్యక్తితో పాటు ఓ మహిళ, మరో ఇద్దరు వ్యక్తులు ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. నగదు బ్యాగ్‌లు ఇస్తుండగా వెస్టు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు వినియోగించిన కారును సీజ్ చేసి,  నిందితులను అర్బన్ ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement