శ్రీశైలం చేరుకున్న నందిగామ ఎమ్మెల్యే పాదయాత్ర

Nandigama MLA Jagan Mohan Rao Padayatra Reach Srisailam - Sakshi

సాక్షి, కర్నూలు: వికేంద్రీకరణకు మద్ధతుగా కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు చేపట్టిన పాద్రయాత్ర ఆదివారం రోజున కర్నూలు జిల్లా శ్రీశైలంకు చేరుకుంది. ఈ నెల 21న నందిగామ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఈ రోజు ఉదయం శ్రీశైలానికి చేరుకొని శ్రీభ్రమరాంబ, మల్లిఖార్జునస్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం వికేంద్రీకరణకు మద్దతు తెలిపేలా చంద్రబాబుకు మంచి బుద్ధి కలిగించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగన్మోహనరావుతో పాటు శ్రీశైలం వైఎస్సార్‌సీపీ నాయకులు డాక్టర్‌ కృష్ణమోహన్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top