పరస్పర సహకారంతో రెండు రాష్ట్రాల అభివృద్ధి | with mutual cooperation two states will develop says Harish Rao | Sakshi
Sakshi News home page

పరస్పర సహకారంతో రెండు రాష్ట్రాల అభివృద్ధి

Feb 12 2018 3:35 AM | Updated on Feb 12 2018 3:35 AM

with mutual cooperation two states will develop says Harish Rao - Sakshi

మంత్రి హరీశ్‌రావుకు శ్రీవారి చిత్రపటం అందజేస్తున్న జేఈవో శ్రీనివాసరాజు

సాక్షి, తిరుమల: రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకారంతో అభివృద్ధి చెందాలని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించానని తెలంగాణ  నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. ఆదివారం ఆయన కుటుం బ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుటుంబ సభ్యుల పుట్టు వెంట్రుకలు సమర్పించే పవిత్ర కార్యక్రమంలో భాగంగా శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సకాలంలో వర్షాలు కురిసి, ›ప్రాజెక్టులు నీటితో నిండి, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. అంతకుముందు ఆలయంలో జేఈఓ కేఎస్‌ శ్రీనివాసరాజు మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక మర్యాదలతో శ్రీవారి దర్శనం కల్పించి, స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement