విజయమే లక్ష్యం | Municipal elections Party candidates Success goal :M. V. Mysura Reddy | Sakshi
Sakshi News home page

విజయమే లక్ష్యం

Mar 6 2014 11:55 PM | Updated on Sep 2 2017 4:25 AM

విజయమే లక్ష్యం

విజయమే లక్ష్యం

మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అవిశ్రాంతంగా కృషి చేయాలని మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా పరిశీలకుడు ఎంవీ మైసూరారెడ్డి

 సాక్షి, రాజమండ్రి :మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అవిశ్రాంతంగా కృషి చేయాలని మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా పరిశీలకుడు ఎంవీ మైసూరారెడ్డి ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కలిసి నిట్టనిలువుగా చీల్చి, ప్రజల మనోభావాల్సి దెబ్బ తీశాయన్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ పార్టీల నైజాన్ని ఎండగట్టాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీ కార్యకర్తలను, నేతలను కార్యోన్ముఖులను చేసేందుకు ఆయన గురువారం రాజమండ్రి ఉమారామలింగేశ్వరస్వామి కల్యాణ మంటపంలో జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ప్రధానంగా ఎన్నికలు జరగనున్న రాజమండ్రి, అమలాపురం, తుని, మండపేట, సామర్లకోట, పెద్దాపురం, రామచంద్రపురం, పిఠాపురం   మున్సిపాలిటీలు, గొల్లప్రోలు, ఏలేశ్వరం, ముమ్మిడివరం నగర పంచాయతీల పరిధిలోని ముఖ్యనేతలు, కో ఆర్డినేటర్లతో విడివిడిగా భేటీ అయి, ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు.
 
 బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలను సేకరించారు. పార్టీని విజయపథాన నడిపించేందుకు అవలంబించాల్సిన వ్యూహాలపై మైసూరారెడ్డి స్థానిక నేతలతో చర్చించారు. సాయంత్రం నాలుగు గంటలకు రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలోని నేతలతో సమావేశమయ్యారు. నగర అధ్యక్షుడు బొమ్మన రాజ్‌కుమార్ నగరంలో పార్టీ పరిస్థితిని మైసూరాకు వివరించారు. మేయర్ స్థానంతో పాటు మెజారిటీ డివిజన్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని మైసూరా ఆకాంక్షించారు. ప్రజల్లో పార్టీకి మంచి ఆదరణ ఉందని, దాన్ని సంపూర్తిగా అనుకూలంగా మలచుకోవడంలో నేతలు సఫలం కావాలని సూచించారు. మైసూరాతో సమావేశమైనవారిలో ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు భాస్కరరామారావు, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు కుడుపూడి చిట్టబ్బాయి, 
 
 సీఈసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ నాయకుడు బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ మంత్రి సంగిత వెంకటరెడ్డి, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి.కె.విశ్వేశ్వరరెడ్డి, జిల్లా విభాగాల కన్వీనర్లు కర్రి పాపారాయుడు, శెట్టిబత్తుల రాజబాబు, గుత్తుల రమణ, నయీం భాయి, గారపాటి ఆనంద్, గెడ్డం రమణ, రావూరి వెంకటేశ్వర్లు, కాకినాడ నగర అధ్యక్షులు ఫ్రూటీకుమార్, కో ఆర్డినేటర్లు గిరజాల వెంకటస్వామి నాయుడు, వరుపుల సుబ్బారావు, పెండెం దొరబాబు, చెల్లుబోయిన వేణు, కొండేటి చిట్టిబాబు, మిండగుదిటి మోహన్, దాడిశెట్టి రాజా, ఆకుల వీర్రాజు, తోట సుబ్బారావు నాయుడు, ఇతర నాయకులు జక్కంపూడి రాజా, విప్పర్తి వేణుగోపాల్, ఆదిరెడ్డి వాసు తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement