ఆర్టీసీ స్థలాల్లో మల్టీప్లెక్స్‌లు | Multiplex in rtc lands | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ స్థలాల్లో మల్టీప్లెక్స్‌లు

Dec 20 2014 7:11 AM | Updated on Sep 2 2017 6:29 PM

బీవోటీ (నిర్మించు-నిర్వహించు-బదలాయించు) పథకం కింద ఆర్టీసీ స్థలాల్లో మల్టీప్లెక్స్‌లు, మాల్స్ నిర్మించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

సాక్షి, హైదరాబాద్: బీవోటీ (నిర్మించు-నిర్వహించు-బదలాయించు) పథకం కింద ఆర్టీసీ స్థలాల్లో మల్టీప్లెక్స్‌లు, మాల్స్ నిర్మించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తొలుత విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లో రూ.350 కోట్లతో ఈ నిర్మాణాలు చేపట్టనుంది. వచ్చే ఏడాది మార్చిలోగా వీటిని నిర్మిస్తారు. పబ్లిక్-ప్రైవేటు (పీపీపీ) భాగస్వామ్యంతో మాల్స్, మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాలు, ఇన్‌స్టిట్యూషనల్ భవనాలు, వినోద కేంద్రాలు, హోటళ్ళు, ఇతర వాణిజ్య సంస్థలకు ఈ స్థలాలను లీజుకు ఇవ్వనున్నారు.

వీటివల్ల ఆర్టీసీ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని, ఆర్టీసీ బస్టాండ్‌ల సమీపంలోని స్థలాల్లో మల్టీప్లెక్స్‌లు, మాల్స్ నిర్మిస్తే బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికుల ద్వారాతద్వారా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని 123 బస్ డిపోల పరిధిలో ఆర్టీసీకి 1,960 ఎకరాల స్థలాలున్నాయి. వీటిలో ముఖ్య పట్టణాల్లోని స్థలాలను లీజు కింద ప్రైవేటు వ్యక్తులకిచ్చే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement