ఎమ్మార్వో కార్యాలయంలో వ్యక్తి హల్‌చల్‌ | mrps activist hulchul in guntur mro office | Sakshi
Sakshi News home page

ఎమ్మార్వో కార్యాలయంలో వ్యక్తి హల్‌చల్‌

Jan 4 2018 3:34 PM | Updated on Aug 24 2018 2:36 PM

సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లా కేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో ఓ వ్యక్తి హల్‌చల్‌ సృష్టించాడు. రోషయ్య అనే ఎమ్మార్పీఎస్‌ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆందోళనకు దిగాడు. అంతేకాకుండా కిరోసిన్‌ డబ్బాతో ఆఫీసులోపలికి వెళ్లి తలుపులు బిగించుకున్నాడు. తన డిమాండ్లను పరిష్కరించాలంటూ డిమాండ్‌ చేశాడు. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించాడు. అయితే వెంటనే అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు రోశయ్యను అదుపులోకి తీసుకున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement