
భోగాపురం: స్థానిక సన్‌రే విలేజ్ రిసార్ట్స్‌లో మంగళవారం ఒక ప్రయివేట్ ఆల్బమ్‌లో పాటకు షూటింగ్ జరిగింది. ముంబయికి చెందిన శివన్నారంగ్, దీపిక్‌లల్వానీలు హీరో హీరోయిన్లుగా ఆల్బమ్‌ని తెరకెక్కిస్తున్నారు. గాయకుడు రహత్‌ఫతే ఆలీఖాన్ పాడిన ఒక ఆల్బమ్‌ని విశాఖపట్నానికి చెందిన బషీర్, ఎం.వి.సత్యనారాయణలు నిర్మాతలుగా తెరకెక్కిస్తున్నారు. జూలై 15న ఆల్బమ్ విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.