మా పాపకు ఆయనే ప్రాణం పోశారు..

Mounisa Heart Surgery With Arogyasri - Sakshi

కంబదూరు :   మాది (నాగార్జున, జయలక్ష్మి దంపతులు) కంబదూరు. మండల కేంద్రంలో నివాసం ఉంటూ ప్రతి రోజు బేల్దారి పనులు చేస్తు జీవిస్తున్నాం. మాకు ముగ్గురు కుమారైలు. చిన్న కుమారై మౌనిసాకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడే గుండెకు రంధ్రాలు పడ్డాయి. వైద్యుల దగ్గరికు వెళ్లి పరీక్షలు చేస్తే గుండెకు ఆపరేషన్‌ చేయాలని సూచించారు. మేం ప్రతి రోజు కూలీ పనులకు వెళ్లి వచ్చిన డబ్బుతో జీవించేవాళ్లం. ఆపరేషన్‌ చేయించడానికి చేతిలో నయాపైసా కూడా లేదు.

ఆ సమయంలో ప్రభుత్వాస్పత్రికి వెళ్లి ఆరోగ్యమిత్రను కలిస్తే వైఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన రాజీవ్‌ఆరోగ్యశ్రీ పథకం కింద గుండె ఆపరేషన్‌ చేయించడానికి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. అక్కడ 2007లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా రూ.3లక్షల వరకు ఖర్చుపెట్టి మా బిడ్డకు ఆపరేషన్‌ చేశారు. దీంతో మా బిడ్డ ప్రాణాపాయం నుంచి బయటపడింది. అలాగే రానూపోనూ చార్జీలు కూడా ఇచ్చి నయాపైసా కూడా భారం పడకుండా చేశారు. ఆ మహానేత వైఎస్‌.రాజశేఖరరెడ్డి పుణ్యం వల్లే మా బిడ్డకు పునర్జన్మ లభించింది. వైఎస్‌ చేసిన సాయాన్ని మేం ఎన్నటికీ మరవలేం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top