పేగు బంధంపై ఎందుకంత పగ

Mother Trying To Leav Birth Child In Visakhapatnam - Sakshi

కూర్మన్నపాలెం బస్టాప్‌ వద్ద గర్భిణి ప్రసవం

అనంతరం బిడ్డను విడిచి వెళ్లిపోయేందుకు యత్నం

జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది, స్థానికుల సహకారంతో

కేజీహెచ్‌కు తరలింపు

అగనంపూడి(గాజువాక): అమ్మతనం కోసం ఆరాట పడేవాళ్లు ఎందరో... అమ్మా అని ముద్దు ముద్దుగా మురిపెంగా పిలిపించుకోవాలని ఆశ పడే అమ్మలు ఉంటారు. అలాంటి అమ్మతనాన్ని కాలదన్ని కన్నపేగు బంధాన్ని వదిలించుకోడానికి ఓ తల్లి చేసిన పయత్నం బెడిసికొట్టిన సంఘటన దువ్వాడ పోలీస్టేషన్‌ పరిధిలో చేటుచేసుకుంంది. బుచ్చయ్యపేట మండలానికి చెందిన అప్పలకొండ భర్త రాజీవ్‌నగర్‌లోని ఒక అపార్టుమెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. అప్పలకొండ కుమార్తె కె.మణి తన భర్తకు దూరంగా తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. ఆమె గర్భిణి కావడంతో చికిత్స కోసం కేజీహెచ్‌కు వెళ్లేందుకు సోమవారం ఉదయం కూర్మన్నపాలెం బస్టాప్‌ వద్ద వేచి ఉంది.

ఆ సమయంలో బస్టాప్‌ వద్దే పురుటి నొప్పులతో బాధపడుతూ మణి ఓ మగ బిడ్డను ప్రసవించింది. అయితే ఆ శిశువును హత్తుకోవాల్సిన మణి బిడ్డను వదిలించుకోవడానికి ప్రయత్నించడంతో అక్కడే ఉన్న జీవీఎంసీ పారిశుధ్య  సిబ్బంది ఆమె ను వారించి బిడ్డను ఆమె కు అప్పగించి, స్థానికుల సహకారంతో 108 అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు. అయితే భర్తకు దూరంగా ఉంటూ గర్భం దాల్చడం వల్లే ఆమె పేగు బంధాన్ని కా దని పరారయ్యేందుకు యత్నించిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే మణికి జాన్‌ అనే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ సంఘటనపై సమాచారం లేదని పోలీసులు చెబుతున్నారు.

శిశువు పరిస్థితి ఆందోళనకరం
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): కూర్మన్మపాలెం బస్టాప్‌ వద్ద రోడ్డు మీద ప్రసవించిన కె.మణి (25) ఆరోగ్య పరిస్థితి బాగుందని కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.అర్జున తెలిపారు. పరామర్శించిన తర్వాత ఆయన మాట్లాడుతూ మణి ఆరోగ్యం నిలకడగా ఉందని, బిడ్డ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడం వల్ల నవజాత శిశువుల విభాగంలో వెంటిలేటర్‌పై ఉంచామని తెలిపారు. ఆమెను సీఎస్‌ఆర్‌ఎంవో కె.ఎస్‌.ఎల్‌.జి.శాస్త్రి, ఆర్‌ఎంవో డాక్టర్‌ సిహెచ్‌.సాధన, సిబ్బంది పరిశీలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top