బిడ్డకి విషమిచ్చి తల్లి ఆత్మహత్య | Mother convicted of killing her son by poisoning | Sakshi
Sakshi News home page

బిడ్డకి విషమిచ్చి తల్లి ఆత్మహత్య

Apr 15 2015 4:13 PM | Updated on Sep 3 2017 12:20 AM

కర్నూలు జిల్లా నంద్యాల మండలంలో బుధవారం దారుణం జరిగింది.

కర్నూలు(నంద్యాల): కర్నూలు జిల్లా నంద్యాల మండలంలో బుధవారం దారుణం జరిగింది. భర్త తరచూ గొడవపడటంతో మనస్తాపం చెందిన ఓ మహిళ, తన బిడ్డకు విషమిచ్చి తాను కూడా తాగి ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని చాబోలు గ్రామానికి చెందిన దూదేకుల మస్తాన్ బీ(27)కు మూడేళ్ల కిందట వివాహమైంది. మస్తాన్ బీకు, కమాల్ పాషాఅనే ఎనిమిది నెలల కొడుకు ఉన్నాడు.

అయితే నిన్న రాత్రి మస్తాన్ బీకు ఆమె భర్తకు గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన మస్తాన్ బీ తాను విషం తాగి బిడ్డకు కూడా పట్టించింది. మస్తాన్‌బీ చనిపోగా చిన్నారి స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసలు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement