నెల్లూరు జిల్లా బాలాయపల్లిలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ బావిలో దూకి ...
నెల్లూరు : నెల్లూరు జిల్లా బాలాయపల్లిలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ బావిలో దూకి తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు. కాగా కుటుంబ కలహాల కారణంగానే వారు ఆత్మహత్యలు చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. మృతులు తల్లి సుజాత, చిన్నారులు సాత్విక్, జోషికగా గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.