కొల్లు రవీంద్ర ఇంతకి తెగిస్తాడనుకోలేదు

సాక్షి, మచిలీపట్నం : తన భర్తది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని వైఎస్సార్‌సీపీ నేత మోకా భాస్కర్‌రావు భార్య వెంకటేశ్వరమ్మ కన్నీటిపర్యంతమయ్యారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంతటి ఘోరానికి పాల్పడుతాడని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అనుమానించినట్లే పోలీసుల విచారణలో నిందితులు కూడా అదే విషయాన్ని వెల్లడించారన్నారు. తన భర్తకు వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేక కొల్లు రవీంద్ర తన అనుచరులతో ఈ దురాగతం చేయించారన్నారు. కొల్లు రవీంద్ర అక్రమాలను తన భర్త ప్రశ్నించేవాడని, గూటాల చెరువు భూముల అమ్మకంపై పోరాటం చేశారని వెంకటేశ్వరమ్మ గుర్తు చేసుకున్నారు. తన భర్తను హతమారుస్తారన్న ఆలోచన తమకు ఎప్పుడూ రాలేదన్నారు. రాజకీయ లబ్ది కోసం ఓ మనిషిని చంపేంత దారుణానికి ఒడిగడతారనుకోలేదన్నారు. (అన్న కోసమే.. మోకా హత్య !)
ఈ హత్యతో ప్రమేయం లేకపోతే కొల్లు రవీంద్ర అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లిపోయారని వెంకటేశ్వరమ్మ సూటిగా ప్రశ్నించారు. తన భర్త హత్యకేసులో ప్రమేయం ఉన్న అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా శిక్షించాలని వెంకటేశ్వరమ్మ కోరారు.(రాజమండ్రి సెంట్రల్ జైలుకు కొల్లు రవీంద్ర)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి