పవన్‌కు మోహన్‌బాబు పంచ్! | Mohan Babu differs with pawan kalyan on ttd issue | Sakshi
Sakshi News home page

పవన్‌కు మోహన్‌బాబు పంచ్!

May 9 2017 3:31 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్‌కు మోహన్‌బాబు పంచ్! - Sakshi

పవన్‌కు మోహన్‌బాబు పంచ్!

ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా నియమించడంపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై ప్రముఖ నటుడు మోహన్ బాబు స్పందించారు.

ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా నియమించడంపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై ప్రముఖ నటుడు మోహన్ బాబు స్పందించారు. పవన్‌కు ఆయన తన మార్కు పంచ్ వేశారు. టీటీడీ ఈఓగా సింఘాల్ నియామకానికి ఆయన మద్దతు తెలిపారు. విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ వెంకన్న బాబు దేవుడని, అలాంటి దేవుడిని ఒక ప్రాంతానికో, ఒక భాషకో మాత్రమే పరిమితం చేయడాన్ని తాను ఖండిస్తున్నానని తెలిపారు. తెలుగు భాష రాకపోవడం ఒక్కటే పెద్ద సమస్య అని తాను అనుకోవట్లేదని మోహన్ బాబు చెప్పారు.

ఉత్తరాది ఐఏఎస్‌ అధికారినిని టీటీడీ ఈవోగా నియమించడంపై తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు, చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని పవన్ ఇటీవల ట్విట్టర్‌ ద్వారా డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఉత్తరాది ఐఏఎస్‌ అధికారులకు తాను వ్యతిరేకం కాదని అన్నారు. అయితే అమర్‌నాథ్‌, వారణాసి, మధుర లాంటి పవిత్ర ఆలయాల్లో దక్షిణాది అధికారులకు ఎందుకు స్థానం కల్పించడం లేదని పవన్‌ ప్రశ్నించారు. దానిపైనే ఇప్పుడు మోహన్ బాబు స్పందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement