వైఎస్ జగన్ దృష్టికి సాగునీటి సమస్యలు | Mlc Maka Sesubabu meet wuth jagan | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ దృష్టికి సాగునీటి సమస్యలు

Feb 28 2016 2:38 AM | Updated on Jul 25 2018 4:07 PM

వైఎస్ జగన్ దృష్టికి సాగునీటి సమస్యలు - Sakshi

వైఎస్ జగన్ దృష్టికి సాగునీటి సమస్యలు

జిల్లాలో సాగునీరు అందక రైతులు పడుతున్న ఇబ్బందులను వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

 పాలకొల్లు టౌన్ : జిల్లాలో సాగునీరు అందక రైతులు పడుతున్న ఇబ్బందులను వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తెలిపారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో పార్టీ అధినేతను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఫోన్‌లో విలేకరులతో మాట్లాడుతూ వంతుల వారీ విధానం పెట్టి పూర్తి స్థాయిలో సాగునీరు అందించకపోవడం వల్ల రైతులు పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని, పూర్తిస్థాయిలో ఎవరికీ నీరు అందకపోవడంతో చేలు నై తీశాయని తెలిపినట్టు చెప్పారు. రైతుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్టు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారన్నారు. రైతులకు అన్నివిధాలుగా అండగా నిలుస్తామని చెప్పారన్నారు
 
 కారుమూరి కుమార్తె వివాహానికి ఆహ్వానం
 తణుకు : తణుకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి వెంకట నాగేశ్వరావు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని శనివారం హైదరాబాద్‌లో కలిశారు. కారుమూరి కుమార్తె దీపిక వివాహం వచ్చే నెల 11న జరగనుండటంతో జగన్‌ను ఆహ్వానించేందుకు సతీసమేతంగా వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలపై చర్చించినట్టు కారుమూరి ఫోన్‌లో చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement